మళ్ళీ యాక్షన్ సినిమాల బాట పట్టిన తమిళ స్టార్ సూర్య
- May 28, 2017
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. ఒకప్పుడు వరుస హిట్స్ తో స్టార్ హీరోగా టాప్ లీగ్ లోకి దూసుకువచ్చాడు. కానీ మధ్యలో చాలా ఎక్స్ పర్మెంట్స్ చేసి ఓ సాధారణ స్టార్ గా మారిపోయాడు. అందుకే ఇక ప్రయోగాలు పక్కనబెట్టి యాక్షన్ సినిమాస్ తో ఎంటర్టైన్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు. అందులో భాగంగానే స్క్రిప్ట్ లు సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అతను చేసిన కొన్ని ఎక్స్ పర్మెంటల్ మూవీస్ కు అప్లాజ్ వచ్చినా ఆర్థికంగా నష్టపోయాయి. మరి కమర్షియల్ గా సత్తాచాటితేనే కదా స్టార్ లీగ్ లో నిలవగలిగేది. ఆ మధ్య సింగం-3తో ఆకట్టుకున్నా.. అది కాస్తా జల్లికట్టు గొడవలో కొట్టుకుపోయింది. స్టార్ హీరోస్ లీగ్ లో నిలవాలంటే కమర్షియల్ హిట్స్ కంపల్సరీ అని తెలుసుకున్న సూర్య ఇప్పుడు విగ్నేష్ శివన్ తో సినిమా చేస్తున్నాడు. "తానా సెంన్ధ్ర కూట్టమ్" పేరుతో రూపొందుతోన్న ఈ మూవీ సూర్య తన సొంత బ్యానర్ లోనే రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో తను మళ్లీ ఫామ్ లోకి వస్తాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు సూర్య. ఏదేమైనా ఒకప్పుడు తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ సంపాదించుకున్న సూర్య సడెన్ గా డౌన్ కావడం ఆశ్చర్యమే.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







