16న రానున్న'అవంతిక'
- May 29, 2017
శ్రీరాజ్ బల్ల దర్శకత్వంలో పూర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అవంతిక’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఆర్. ఫణిరాజ్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోందని చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘భీమవరం టాకీస్‌లో వస్తోన్న 90వ చిత్రమిది. పూర్ణ నటిస్తున్న ఈ చిత్రంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ‘అరుంధతి’, ‘అమ్మోరు’, ‘రాజుగారి గది’ తరహాలో గ్రాఫిక్స్‌తో కూడుకున్న చిత్రమిది. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని సెన్సార్‌కు సిద్ధమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 16న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.
గీతాంజలి, కొబ్బరిమెట్ట ఫేం శ్రీరాజ్, షియాజీ షిండే, షకలక శంకర్, ధనరాజ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కర్ణ, పాటలు: భారతీబాబు, ఎడిటింగ్: శివ వై ప్రసాద్, సంగీతం: రవి బల్ల.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







