అమెరికాలో నితిన్ 'లై' యాక్షన్
- May 29, 2017
''నితిన్ కెరీర్లోనే 'లై'ని భారీగా తెరకెక్కిస్తున్నాం. ఇటీవల అమెరికాలో తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్, పాటలు సినిమాకు హైలైట్ అవుతాయి'' అని 'లై' చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర అన్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై రూపొందుతోంది. వెంకట్ బోయనపల్లి సమర్పిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ''నితిన్ కెరీర్లో డిఫరెంట్ చిత్రంగా రూపొందుతోంది. అమెరికాలోని ఎలినెవేడా, లాస్ వెగా్సలో యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించాం. కాలిఫోర్నియాలోని మొజావేలోని మిడెస్ట్ లో ఫైట్ మాస్టర్ కెచ్చా నేతృత్వంలో వెయ్యిమంది ఫైటర్ల మధ్య క్లైమాక్స్‌ను భారీగా తెరకెక్కించాం. హాలీవుడ్ ఫైట్ మాస్టర్ జెఫ్రీ ట్రాయ్ జెయ్ ఓ ఛేజ్‌ను, స్టన్ శివ మరో ఛేజ్‌ను కంపోజ్ చేశారు. మరో యాక్షన్ సీక్వెన్స్ ను 'ట్రాన్స్ ఫార్మర్స్'ని షూట్ చేసిన డోనాల్ట్ ట్రంప్‌కి చెందిన ట్రం ప్ టవర్స్‌లో తెరకెక్కించాం. వీటితో పాటు మూడు పాటలను కూడా పూర్తి చేశాం. జూన్ 7 నుంచి 11 వరకు చికాగోలోని డౌన్ టౌన్ లో ఒక పాటను చిత్రీకరిస్తాం.
జూన్ 14తో అమెరికా షెడ్యూల్ పూర్తవుతుంది. ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని అన్నారు.
తాజా వార్తలు
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..







