రమదాన్ వేళ వంటగది ప్రమాదాలు గురించి పౌర రక్షణ శాఖ హెచ్చరిక
- May 31, 2017
రియాద్ : పౌరులు, నివాసితులకు దేశీయ ప్రమాదాలు నివారించడానికి గరిష్ట జాగ్రత్తలు తీసుకోవాలని తద్వారా సురక్షితమైన వాతావరణం ఏర్పరచాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ పిలుపునిచ్చారు. గృహిణులు మరియు గృహ కార్మికులు అగ్ని ప్రమాదాలు నివారించేందుకు గ్యాస్ పొయ్యల భద్రతకు భరోసా ఇవ్వకుండా పెనం పై నూనె తో పదార్ధాలను వేయించడానికి పూనుకోరాదని సరైన మార్గదర్శకాలను పాటించమని సివిల్ డిఫెన్స్ శాఖ కోరింది. ఇందుకోసం వివిధ అవగాహన సందేశాలను వ్యాప్తి చేసేందుకు ఆయా సమాచారం అందరికీ చేరుకునేందుకు "వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు సివిల్ డిఫెన్స్ పేర్కొంది.సివిల్ డిఫెన్స్ చీఫ్ సులీమాన్ బిన్ అబ్దుల్లా అల్-అమ్రో మాట్లాడుతూ, "పెద్ద సంఖ్యలో ముద్రణ మరియు ఎలక్ట్రానిక్ వార్తాపత్రికలు, జాతీయ మరియు అంతర్జాతీయ టీవీ ఛానళ్లతో, సమర్థవంతమైన భాగస్వామ్యాలను నిర్మించడంలో విజయం సాధించింది, ఈ కార్యక్రమాలు ప్రమాదాన్ని నివారించడానికి, నష్టాలను తగ్గిస్తాయనే దానిపై కనీస అవసరాలు మరియు ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తాయి.వెబ్సైట్లో నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఆహార తయారీలో సంభవించే దేశీయ ప్రమాదాలు నివారించడానికి నివారణ విద్యా కార్యక్రమాలలో భాగంగా ఉన్నాయి.పిల్లల భద్రత విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయా మార్గదర్శక సూత్రాలు వివరిస్తారు , వాషింగ్ మెషీన్స్, వాక్యూమ్ క్లీనర్ల మరియు పొయ్యిలు వంటి యంత్రాలు నుండి దూరంగా ఉంచాలి. వంటగదిలో పనిచేసేవారు తేలిగ్గా ఎగిరే సిల్కు వంటి దుస్తులను ధరించకూడదని సూచించారు.సివిల్ డిపార్ట్మెంట్ సూచన ప్రకారం అన్ని గృహ వంటశాలలలోని అగ్నిమాపక నిరోధక చిన్న డబ్బాలను కలిగి ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు మరియు వాటిని అత్యవసర పరిస్థితుల్లో ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం ముఖ్యమని అన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







