ప్రమాదం నుండి తప్పించుకున్న సన్నీ
- May 31, 2017
బాలీవుడ్ నటి సన్నీలియోన్ పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. సన్నీ తన భర్త డేనియల్, మరికొందరు స్నేహితులతో కలిసి బుధవారం ఓ ప్రైవేటు విమానంలో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో వాతావరణం అనుకూలించక పోవడంతో విమానం కుదుపులకు గురైంది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని జాగ్రత్తగా మారుమూల ప్రాంతంలో దింపేశాడు.
విమానం ప్రమాదానికి గురైనప్పుడు తాను అనుభవించిన భయానక క్షణాలను వివరిస్తూ సన్నీ లియోన్ ఓ సెల్ఫీ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. మేము ప్రాణాలతో ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలు! వాతావరణం అనుకూలించని కారణంగా మా ప్రైవేటు విమానం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ప్రస్తుతం ఇంటికి వెళుతున్నాము.. థ్యాంక్స్ యూ గాడ్ అని సన్ని ట్వీట్ చేశారు. పైలట్స్ అద్భుతమైన నైపుణ్యం కలవారని, తమ జీవితాలను కాపాడారని సన్ని చెప్పారు. సన్నీ ప్రాణాలతో బయటపడటంతో ఆమె అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







