జపాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ సైనిక విన్యాసాలు
- June 01, 2017
జపాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ సైనిక విన్యాసాలను చేపట్టింది. అమెరికా దళాలతో కలిసి సముద్రజలాల్లో వీటిని నిర్వహిస్తోంది. అయితే ఉత్తర కొరియా దూకుడు శ్రుతిమించడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. జపాన్ కు చెందిన రెండు వైమానిక యుద్దనౌకలపై విన్యాసాలు నిర్వహిస్తుండగా..వీటికి 8 ఎస్కార్ట్ షిప్ లు రక్షణ కల్పిస్తున్నాయి. ఈ విన్యాసాల్లో అమెరికాకు చెందిన నెవీ ఎఫ్-15, జపాన్ కుచెందిన ఎఫ్ -15జెట్ ఫైటర్స్ తోపాటు పలు సైనిక విమానాలు, హెలికాప్టర్స్ లు పాల్గొంటున్నాయి. ఇరుదేశాలు కలిసి చేస్తున్న అతిపెద్ద సైనిక విన్యాసాలు ఇదేనని అమెరికా అధికారులు తెలిపారు. వీటిద్వారా తమ సైనిక సత్తాను ప్రపంచానికి చాటుతున్నాయి. కొద్దిరోజులక్రితం నార్త్ కొరియా మధ్యస్థ మిస్సైల్ పరీక్షలు నిర్వహించిన నేపధ్యంలో... జపాన్ సైనిక విన్యాసాలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇరుదేశాలమధ్య సైనిక ప్రదర్శనలు ఎటువైపు దారితీస్తాయోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







