తీవ్రవాద నేరం: వ్యక్తికి 40 ఏళ్ళ జైలు
- June 01, 2017
అబుదాబీ: అబుదబీ ఫెడరల్ కోర్ట్ ఆప్పీల్స, పాకిస్తానీ వ్యక్తికి 40 ఏళ్ళ జైలు శిక్షను విధించింది. తీవ్రవాద నేరాలకు పాల్పడుతున్నాడన్న అభియోగాల నేపథ్యంలో 22 ఏళ్ళ వ్యక్తికి న్యాయస్థానం శిక్ష విధించింది. స్పియర్ గన్ని ఉపయోగించి విదేశీయుల్ని హత్య చేసేందుకు యత్నించిన కేసులో 24 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. ఇంకో వైపున ఓ విల్లాని, అలాగే 8 కార్లను తగలబెట్టిన కేసులో 15 ఏళ్ళ జైలు శిక్ష అనంతరం డిపోర్టేషన్‌ని న్యాయస్థానం ఖరారు చేసింది. మరో కేసులో ఆరుగురు యంగ్ ఎమిరేట్స్ని, టెర్రరిజాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న కేసులో న్యాయస్థానం కౌన్సిలింగ్ సెంటర్‌కి తరలించాల్సిందిగా ఆదేశించింది. వీరంతా 20 నుంచి 25 ఏళ్ళ వయసువారు. ఇంకో కేసులో నలుగురు జోర్డానియన్లపై డయీష్ టెర్రరిజం గ్రూపులో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభియోగాల నేపథ్యంలో కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!







