చికెన్ షాకూటి
- June 01, 2017
కావలసిన పదార్థాలు: చికెన్: కిలో(ముక్కలుగా కట్ చేసుకోవాలి), లవంగాలు: ఐదు లేక ఆరు, మిరియాలు: పది లేక పన్నెండు, ఎండు మిర్చి: పది, దాల్చినచెక్క: చిన్నది, ధనియాలు: టేబుల్ స్పూను, యాలకుల పొడి: పావు టీస్పూను, నూనె: అరకప్పు, మెంతులు: పావు టీస్పూను, ఎండుకొబ్బరి: రెండు స్పూన్లు, నిమ్మరసం: మూడు టీస్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా, గసగసాలు రెండు టేబుల్ స్పూన్లు, నీళ్ళు: తగినన్ని,అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు స్పూన్లు, ఉల్లిపాయ:ఒకటి(ముక్కలుగా చేసి ముద్దగా చేసుకోవాలి)
తయారీ విధానం: ముందుగా ఎండుమిర్చిని పావు గంట పాటు నీటిలో నానపెట్టుకోవాలి. ఇప్పుడు లవంగాలు, ధనియాలు, మిరియాలు, దాల్చినచెక్క, కొబ్బరి, గసగసాలు అన్నీ మెత్తగా ముద్దగా రుబ్బుకోవాలి. ఆ తరువాత ఎండు మిర్చిని కూడా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకుని అందులో నూనె వేసి కాగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి సన్నని మంట మీద వేయించుకోవాలి. ఆ తరువాత దీనికి ఉప్పు, పసుపు రుబ్బిపెట్టుకున్న మసాలా ముద్ద జత చేసి కొద్దిగా వేయించి తగినన్ని నీరు పోసుకోవాలి. ఇది కొద్దిగా తెర్లుతుండగానే చికెన్ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. చికెన్ ముక్కలు ఉడికిన తరువాత సిద్ధం చేసుకున్న ఉల్లిపాయల ముద్ద, ఎండుమిర్చి ముద్ద, యాలకుల పొడి వేసి మరికొద్దిసేపు ఉడికించి దించేయాలి. దించేముందు కొత్తిమీర చల్లుకోవాలి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







