తమిళ్ హీరో అజిత్ కి తీవ్ర గాయాలు..!
- June 01, 2017
తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంత గొప్ప మాస్ ఇమేజ్ సంపాదించిన హీరో అజిత్ కుమార్. అచ్చమైన తెలుగు అబ్బాయి..తెలంగాణలోని హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు. తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన ప్రేమ పుస్తకంతో ప్రారంభించాడు. సికింద్రాబాద్లో పుట్టిన అజిత్.. పదోతరగతి వరకు మాత్రమే చదివినా, అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళంతో పాటు ఇంగ్లీషు పరిజ్ఞానం కూడా అజిత్ కు ఎక్కువే. ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలినిని 2000 సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నాడు.
ప్రేమ పుస్తకం తర్వాత తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన అజిత్ అక్కడ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళంలో అజిత్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. తాజాగా 'వివేగం' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అజిత్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కి సంబంధించి అజిత్ గాయపడినట్లు సమాచారం.
ఎలాంటి డూప్ లేకుండా స్టంట్లో పాల్గొన్న హీరో, ఆ సమయంలో ప్రమాదవశాత్తూ కిందపోయాడు. వెంటనే భుజానికి గాయమైనట్లు తెలుస్తోంది. గతంలో కూడా అజిత్ కొన్ని సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించి గాయాల పాలయ్యారు. 'వివేగం' చిత్రానికి కూడా ఎలాంటి డూప్ లేకుండా స్టంట్లో అజిత్ మరోసారి గాయపడ్డాడు.
అజిత్ ని వెంటనే దగ్గరలో ఆసుపత్రికి యూనిట్ సభ్యులు తరలించారు. ఈ విషయం తెలిస్తే అభిమానులు కంగారు పడతారని భావించిన యూనిట్ సభ్యులు, బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శివ డైరెక్షన్లో రెడీ అవుతోన్న ఈ చిత్రాన్ని ఆగస్టు 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







