'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్ సుధాకర్ 'నువ్వు తోపురా' ఫస్ట్ లుక్
- June 02, 2017
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్ సుధాకర్ కొంత విరామం తరువాత మళ్లీ వెండితెరపై కనువిందు చేసేందుకు రెడీ అయ్యాడు. హరనాథ్ బాబు.బి దర్శకత్వంలో యునైటెడ్ ఫిలిమ్స్ పతాకంపై డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న నువ్వు తోపురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సుధాకర్ కోమాకుల డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.
సుధాకర్ కోమాకుల సరసన నిత్యా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను శుక్రవారం(జూన్ 2) విడుదల చేసారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.శ్రీకాంత్ మాట్లాడుతూ.. 'సుధాకర్ కోమాకుల, నిత్యాశెట్టిలు జంటగా రూపొందుతున్న 'నువ్వు తోపురా' సినిమాను 70% అమెరికాలో షూట్ చేసేందుకు ప్లాం చేస్తున్నాం. 30% ఇండియాలో షూట్ చేస్తాం. మొదటి షెడ్యూల్ మే 23న మొదలయింది. తర్వాతి షెడ్యుల్ అమెరికాలో ప్రారంభంకానుంది. హాలీవుడ్ కాన్సెప్ట్తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ను జూన్ 9న విడుదల చేయనున్నాం' అని తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







