' అంధగాడు ' రివ్యూ

- June 02, 2017 , by Maagulf
' అంధగాడు ' రివ్యూ

రాజ్‌తరుణ్‌, హెబ్బాపటేల్‌, రాజేంద్రప్రసాద్‌ తదితరులు..
వెలిగొండ శ్రీనివాస్‌
రామబ్రహ్మం సుంకర
శేఖర్ చంద్ర

ఉయ్యాలా జంపాల చిత్రం తో వెండి తెర కు హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్..మొదటి నుండే సరికొత్త కథలను ఎంచుకుంటూ సక్సెస్ అవుతూ వస్తున్నాడు..కుమారి 21 ఎఫ్ , సినిమా చూపిస్తా మావ, ఈడో రకం ఆడో రకం వంటి హిట్స్ కొట్టి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.. రాజ్ తరుణ్ నుండి సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం కలిగించాడు.
నూతన డైరెక్టర్ వెలిగొండ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ ఫై అంధగాడు గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రివెంజ్‌ స్టోరీ ఎంచుకోవడమే కాదు, ఈ మూవీ లో అంధుడిగా కనిపించడం జరిగింది..మరి అంధుడిగా ఎలా నటించాడు..అసలు ఆ రివెంజ్‌ స్టోరీ ఏంటిదనేది ఇప్పుడు చూద్దాం.
గౌతమ్‌ (రాజ్ తరుణ్) పుట్టకతోనే కళ్ళు కనిపించవు.. ఓ అనాథాశ్రమంలో పెరిగి పెద్దవాడవుతాడు..ఆ తర్వాత రేడియో జాకీ గా కాలం గడుపుతూ శ్రోతలను అలరిస్తుంటాడు..ఈ లోపు కళ్ల డాక్టర్ నేత్ర (హెబ్బా పటేల్‌) తో పరిచయం ఏర్పడుతుంది. తనకు కళ్లు కనిపించవనే సంగతి ఆమెకు తెలియకుండా కవర్ చేస్తాడు..ఈ లోపు నేత్ర కు గౌతమ్ కు కళ్లు లేవనే నిజం తెలుస్తుంది..ఆ తర్వాత అతడికి ఆపరేషన్ చేసి వేరే వారి కళ్లను గౌతమ్ కు పెడుతుంది. అసలు సమస్య ఆ కళ్లుతోనే మొదలవుతుంది..ఓ ఆత్మ ..గౌతమ్ కు కనిపిస్తూ రెండు హత్యలు చేయాలనీ వెంటపడడం స్టార్ట్ చేస్తుంది..మరి గౌతమ్ ఆ ఆత్మ కోరిక తీరుస్తాడా..? అసలు ఆ ఆత్మ ఎవరు..? ఆ ఆత్మ కు గౌతమ్ కు సంబంధం ఏంటి..? అనేది మీరు తెర ఫై చూడాల్సిందే..
* సెకండ్ హాఫ్
* రాజ్ తరుణ్
* కథ - కథనం
* హెబ్బా పటేల్ గ్లామర్
* కామెడీ
* ఫస్ట్ హాఫ్
* మ్యూజిక్
* ముందుగా రాజ్ తరుణ్ యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి..షార్ట్ ఫిలిమ్స్ తోనే తన టాలెంట్ ఏంటో ప్రేక్షకులకు చూపించాడు..ఆ తర్వాత వెండి తెర కు పరిచయమై సినిమా సినిమాకు తనలోని నటనకు పెంచుకుంటూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ మూవీ లో కూడా అంధుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు. నిజంగా కళ్లు లేనివారు ఎలా ఉంటారో..అదే మాదిరిగా రాజ్ తరుణ్ యాక్ట్ చేసాడు. కళ్లులేనప్పుడు ఎలా కష్టపడ్డాడో.. కళ్లొచ్చిన తర్వాత దానికి రెట్టింపు కష్టం అనుభవిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు.
* హెబ్బా పటేల్ విషయానికి వస్తే..తన గ్లామర్ తో మరోసారి యూత్ కు బాగా దగ్గరయింది..కథ లో ఆమె పాత్ర కు పెద్దగా స్కోప్ లేకుండా పోయింది..పాటలు , హీరో తో కాస్త ప్రేమాయణం తప్ప పెద్దగా ఏమిలేదు. కులకర్ణి గా రాజేంద్రప్రసాద్ నటన బాగుంది..ఆశిష్ విద్యార్థి, రాజా రవీంద్ర, షాయాజీ షిండే, సత్య, పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులు వారి మేరకు బాగానే చేసారు.
* శేఖర్ చంద్ర సంగీతం పెద్దగా ఆకట్టుకోలేక పోయింది..అలాగే నేపధ్య సంగీతం కూడా జస్ట్ ఓకే అనిపించింది. బి.రాజశేఖర్‌ కెమెరా వర్క్ బాగుంది. వెలిగొండ శ్రీనివాస్‌ మాటలు బాగా పేలాయి..కామెడీ టైమింగ్స్ లో తాను అందించిన డైలాగ్స్ బాగా నవ్వు తెప్పిస్తాయి. ఇక రామబ్రహ్మం సుంకర నిర్మాణ విలువలు తెర ఫై కనిపిస్తాయి..
* ఇక డైరెక్టర్ వెలిగొండ శ్రీనివాస్‌ ఈ మూవీకి కథ, మాటలు , స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని ఆయనే..ఎక్కడ ఏ లోటు లేకుండా తెర ఫై అందగాడిని బాగా చూపించాడు. కథ పాతదే అయినప్పటికీ తెర ఫై కొత్తగా చూపించి సక్సెస్ అయ్యాడు. డైరెక్టర్ కు మొదటి చిత్రమయినప్పటికీ ఎక్కడ కూడా సినిమా ఫీల్ మిస్ కాకుండా తెరకెక్కించి తన సత్తాను చాటుకున్నాడు.
రివెంజ్‌ కథలు.. ఆత్మలు పగ తీర్చుకోవడాలు ఇలాంటి కథలు చాలానే వచ్చినప్పటికీ..ఈ మూవీ లో మాత్రం కాస్త కొత్తగా చూపించాడు డైరెక్టర్..ఫస్ట్ హాఫ్ అంత నటి , నటుల పరిచయాలు , హీరో - హీరోయిన్ ప్రేమ, కామెడీ లతోనే నడిపించాడు..ఇక అసలైన కథ సెకండ్ హాఫ్ లో స్టార్ట్ చేసాడు.. ఆత్మ పగ తీర్చుకోవడానికి గౌతమ్ ను వాడుకోవడం..ఆత్మ తో గౌతమ్ పడే ఇబ్బందులు..వంటివి ప్రేక్షకుడికి వినోదాన్ని కలిగిస్తాయి..క్లైమాక్స్ మొత్తం కూడా కామెడీ తో సాగిపోవడం తో థియేటర్స్ నుండి వస్తున్న వారు నవ్వుతు వస్తున్నారు. ఓవరాల్ గా డైరెక్టర్ తెలిసిన కథనే నమ్ముకున్న తెరకెక్కించడం లో కొత్తగా చూపించి సక్సెస్ అయ్యాడు..రాజ్ తరుణ్ కూడా తన పాత్ర కు న్యాయం చేసాడు..మొత్తానికి ఈ అంధగాడు 'ఆకట్టుకునే అంధగాడు'.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com