స్మోకింగ్ మానేసేవారికోసం క్లినిక్స్
- June 02, 2017
ఒక్కసారి స్మోకింగ్ అలవాటైతే, అది మానడం చాలా కష్టం. ఎలాగైనా మానేయాలనుకునేవారూ, కొన్ని బలహీనతల కారణంగా మానలేకపోతుంటారు. అలాంటివారికోసమే క్లినిక్స్‌ని ఏర్పాటు చేసింది ఖతార్ మినిస్ట్రీ. లీబైబ్, అల్ దాయీన్, అల్ ఘరాఫా, ఒమర్ బిన్ ఖత్తాబ్, అబు బక్ర్ అల్ సిదిక్, మెసైమీర్ (అబు హామర్), రాదత్ అల్ ఖైల్ హెల్త్ ఫెసిలిటీస్ వద్ద వీటిని ఏర్పాటు చేశారు. హెల్త్ ప్రమోషన్ అండ్ రికవరీ - పిహెచ్‌సిసి డైరెక్టర్ డాక్టర్ వధా అల్ బకర్ మాట్లాడుతూ, స్మోకర్స్ పైన పేర్కొన్న క్లినిక్స్‌ని సంప్రదించి, తమకున్న దురలవాటుని దూరం చేసుకోవచ్చన్నారు. మే 31న 'వరల్డ్ నో టుబాకో డే' సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టామన్నారు. స్మోకింగ్ కారణంగా శరీరంలోని ప్రతి అవయవం ఎఫెక్ట్ అవుతుందనీ, అది మానేయడం వల్ల చాలావరకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







