సినిమా, టీవీ రంగాల్లో ఒక్కక్కరిగా రాలిపోతున్న వైనం
- June 05, 2017
ప్రస్తుతం సినిమా, టీవీ రంగాల్లో యాక్సిడెంట్ డెత్ లు, సూసైడ్స్ తో అందరి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.. ఇక పెద్ద వయసుతో వచ్చే అనారోగ్యాలతో పలువురు సినీ ప్రముఖులను పోగొట్టుకొంటున్న సినీ రంగం.. లో ఆత్మహత్యలతో కూడా కలత చెందుతుంది.. తాజాగా సింగర్ గా పేరు తెచ్చుకొంటున్న సుజిత్(23) ఆత్మహత్య చేసుకొన్నాడు.. వివరాల్లోకి వెళ్తే...
హైదరాబాద్ లోని మీట్ పేట్ లోని ఎస్ఎల్ ఎన్ఎస్ కాలనీకు చెందిన సుజిత్ సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చేశాడు.. సుజిత్ శ్రీత్యాగరయ గానసభలో వివిధ కార్యక్రమాలు చెయ్యడమే కాదు.. శ్రీశారద మ్యూజిక్ అకాడమీ అద్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాలలో తన ప్రతిభాను చాటి చెప్పాడు.. గాయకుడిగా మంచి పేరు తెచ్చుకొంటున్న సుజిత్ ఆది వారం రోజున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.. మూడు రోజులుగా సుజిత్ ఏదొరకంగా మాట్లాడుతున్నాడని... కానీ ఇంతలోనే ఇంత దారుణం చేసుకొంటాడు అనుకోలేదని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు.. కాగా సుజిత్ గురించి తెలిసిన వారందరూ ఎందుకు ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడో తెలియక బాధపడుతున్నారు.
తాజా వార్తలు
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు







