ఒమన్ ఎయిర్‌పోర్టుల్లో ఒమన్‌టెల్ సాంకేతిక సేవలు
- June 05, 2017
సుల్తానేట్‌లో ఇంటిగ్రేటెడ్ టెలికమ్యూనికేషన్స్‌తో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న ఒమన్ టెల్, మస్కట్, సలాలా, సోహార్ మరియు డెక్మ్లలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవల్ని అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. సేఫ్టీ, సెక్యూరిటీ విభాగంలో సేవలను విస్తృతంగా చేపట్టడమే ఈ ఒప్పందం లక్ష్యం. వివిధ ఎయిర్‌పోర్ట్‌ల మధ్య కమ్యూనికేషన్ తదితర వ్యవస్థల ఏర్పాటులో ఒమన్ టెల్ కీలకంగా వ్యవహరిస్తోంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్, ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ (ఓఎఎంసి), ఒమన్ ఎయిర్ వంటివాటికీ ఒమన్ టెల్ సేవలందిస్తోంది. ఎయిర్‌పోర్టులు దేశానికి గేట్ వేలు అనీ, అలాంటి విభాగంలో తమ సేవలు తమకెంతో గర్వకారణంగా ఉన్నాయని ఒమన్ టెల్ వర్గాలు వెల్లడించాయి. మారుమూల గ్రామాలకు సైతం ఒమన్ టెల్ సేవలు అందించే దిశగా ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నట్లు సంస్థ ప్రతినిథులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







