అమ్నెస్టీ: కింగ్‌డమ్‌ని వీడిన 345,000 మంది వలసదారులు
- June 05, 2017
సౌదీ అరేబియా:గడచిన రెండు నెలల్లో అమ్నెస్టీ ద్వారా లాభపడి, దేశాన్ని వీడిన వలసదారుల సంఖ్య 34,000కి పైగానే ఉందని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 345,089 మంది ఇప్పటిదాకా దేశాన్ని వీడారు అమ్నెస్టీతో. ఈ విషయాన్ని పాస్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ దైఫల్లా బిన్ సట్టామ్ అల్ హువైఫి చెప్పారు. 90 రోజుల అమ్నెస్టీని ఇంటీరియర్ మినిస్ట్రీ మార్చి 29న ప్రారంభించింది. ఎలాంటి పెనాల్టీలు లేకుండా అమ్నెస్టీ సమయంలో వలసదారులు దేశం విడిచి వెళ్ళేందుకు అవకాశముంది. వివిధ ఉల్లంఘనలతో ఇబ్బందులుపడుతున్న ఎంతోమందికి అమ్నెస్టీ ఊరటగా నిలిచింది. దేశం నుంచి అక్రమ వలసదారుల్ని బయటకు పంపించేందుకుగాను అమ్నెస్టీని ప్రకటించడం జరిగింది. అమ్నెస్టీ తర్వాత కూడా ఉల్లంఘనులు దేశంలో ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







