ఫుజైరః ట్రాఫిక్ ప్రమాదంలో16 ఏళ్ళ బాలుడి దుర్మరణం
- June 05, 2017
ఫుజైరః : రమాదాన్ మొదటి వారంలో16 ఏళ్ల బాలుడి మరణంతో సహా, ఫుజైరః రెండు ప్రమాదకరమైన ట్రాఫిక్ ప్రమాదాలు నమోదు కాబడ్డాయి. ఫుజైరః పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మే 27 వ తేదీన రమదాన్ ప్రారంభంలో జరిగిన పలు కారు ప్రమాదాలపై ప్రతిస్పందించారు, అత్యధిక ప్రమాదాలలో బాధితులు చిన్న చిన్న గాయాలతో బైటపడ్డాయారని ఆయన పేర్కొన్నారు. ఫ్యూజైరా పోలీస్ ట్రాఫిక్ మరియు పెట్రోల్ వద్ద డైరెక్టర్ కల్నల్ అలీ రషీద్ బిన్ అవాష్ మాట్లాడుతూ, శనివారం సాయంత్రం ఆల్ సిజి ప్రాంతంలో మొదటి ట్రాఫిక్ ప్రమాదం జరిగింది.ఒక అంతర్గత రహదారిలో వేగంగా ప్రయాణిస్తున్న రెండు ట్రక్కులు ఎదురెదురుగా ఒక దానితో ఒకటి ' ఢీ ' కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక ట్రక్ డ్రైవర్ కు ఒక మోస్తరు గాయాలు కాగా మరొక ట్రక్కు డ్రైవర్ మరణించాడని కల్నల్ బిన్ అవాహ్ పేర్కొన్నారు. అదేవిధంగా రెండవ ప్రమాదంలో 16 ఏళ్ళ బాలుడు తన కారుతో వేగంగా వచ్చి ఒక దీపపు స్తంభాన్ని ' ఢీ ' కొట్టాడు. దాంతో ఆ దీపపు స్థంభం నేరుగా ఆ బాలుని తలపై పడింది. ఈ సంఘటనతో రెండవ మరణం నమోదైంది. . బాధితుడైన ఈ కుర్ర డ్రైవర్ కు ఎటువంటి లైసెన్స్ లేదని కల్నల్ బిన్ అవాష్ తెలిపారు. ఆ యువకుడు తన తండ్రి కారుని తీసుకొని షేక్ మక్టౌన్ రహదారిపై మసీఫీ నుండి ఫుజియరాకు వైపు ఆ కారుని నడుపుతూ , ఆ కారుపై నియంత్రణ కోల్పోయాడు. ఎమిరేట్ యొక్క ఫ్యూజైరా ప్రాంతంలో గత వారంలో అనేక ట్రాఫిక్ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని అయితే, వీటిని చిన్న మరియు చిన్న సంఘటనలు వివిధ సమయాల్లో జరిగేయని అయితే, ఖచ్చితమైన సంఖ్యలో ట్రాఫిక్ ప్రమాదాలు నిర్ధారించబడలేదని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- Dubai Press Club launches new phase of ‘Dubai Content Creators Programme’
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి







