దేశీయ ఐటీ సంస్థ టీసీఎస్ హెచ్ 1 బీ వీసా కోత

- June 06, 2017 , by Maagulf
దేశీయ ఐటీ సంస్థ టీసీఎస్ హెచ్ 1 బీ వీసా కోత

దేశీయ ఐటీ సంస్థ టీసీఎస్ హెచ్ 1 బీ వీసా దరఖాస్తుల్లో కోత విధించింది. 2015 లో దరఖాస్తు చేసుకున్నవాటిలో మూడో వంతు మాత్రమే ఈ సారి అప్లయ్ చేసుకున్నట్టు ఈ కంపెనీవర్గాలు తెలిపాయి. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వీసాల జారీలో కఠినతర ఆంక్షలు విధించడంతో టీసీఎస్ సహా ఇన్ఫో సిస్, కాగ్నిజెంట్ సంస్థలు ఎక్కువ సంఖ్యలో వీసాలను తమ లిస్టులోకి మళ్ళించుకుంటున్నాయని ఆరోపణలు వచ్చాయి.

ఒక్క అమెరికాలోనే కాకుండా ఆస్ట్రేలియా, సింగపూర్ లోనూ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో చాలా ఐటీ కంపెనీలు తమ వాణిజ్య లావాదేవీలను మార్చుకుంటున్నాయి. వచ్చే రెండేళ్లలో 10 వేల మంది అమెరికన్లను నియమించు కుంటామని ఇన్ఫోసిస్ ఇదివరకే ప్రకటించింది. అయితే అమెరికాలోని కొన్ని సంస్థలు భారత్ లోని తమ బ్రాంచ్ లకు ప్రాజెక్ట్ ఔట్ సోర్సింగ్ విధానం పట్ల మొగ్గు చూపడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com