మైఖిల్ జాక్సన్ ది సహజ మరణం కాదు.. హత్య అంటోన్న బెస్ట్ ఫ్రెండ్ పెర్కిన్
- June 06, 2017
మైఖేల్ జాక్సన్.. ప్రపంచ వ్యాప్తంగా తన సంగీతం తో సంగీత ప్రేమికులను ఉర్రూతలూగించిన వ్యక్తి.. మైఖేల్ జాక్సన్.. జీవితం పడి లేచిన కెరటం.. ఎగసి పడిన అల... అవును ఎంతో ఉన్నత స్థాయిలోకి చేరిన మైఖేల్ జాక్సన్ 2009 జూన్ 25న మరణించాడు.. కాగా మైఖేల్ తన చివరి రోజుల్లో మరణ భయంతో అల్లాడి పోయాడు.. తనను తనవారే చంపేస్తారని తన ప్రాణస్నేహితుడికి లేఖ రాసిన సంగతిని ఓ ఆస్ట్రేలియన్ ఛానల్ కు మైఖేల్ జాక్సన్ బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.. కాగా తన తండ్రిది సహజ మరణం కాదని.. ఆయనది హత్య అని మొదటి నుంచి మైఖేల్ కూతురు ప్కారీస్ జాక్సన్ చెబుతున్న సంగతి విధితమే.. వివరాల్లోకి వెళ్తే...
మైఖేల్ జాక్సన్ మరణం పై రహస్యాలను ఆస్ట్రేలియన్ ఛానల్ ఓ ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది.. ఈ కార్యక్రమం ఆయన మరణించిన జూన్ 25 న ప్రసారం చేయనున్నది.. ఈ కార్యక్రమంలో మైఖేల్ బెస్ట్ ఫ్రెండ్ పెర్కిన్ ఎన్నో ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆ ఇంటర్వ్యూలో తన మరణానికి ముందు మైఖేల్ తనకు 13 ఉత్తరాలను రాసినట్లు... మైఖేల్ ఫ్రెండ్ పెర్కిన్ చెప్పాడు... ఆ ఉత్తరాల్లో తనను వాల్లే చంపేస్తారని.. భయంగా ఉందని చెప్పాడట.. లండన్ కు చెందిన ఓ కచేరీ సంస్థ ఏఈజీ తనను విపరీతంగా ఒత్తిడి కి గురిచేస్తోందని... జీవితం పట్ల తనకు చాలా భయంగా ఉందని ఆయన తన ఉత్తరాల్లో రాసినట్లు ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.. మైఖేల్ కు పెర్కిన్ కు మధ్య స్నేహం దశాబ్దం కంటే ఎక్కువ అని ఛానల్ వారు చెప్పారు.. కాగా తన తండ్రి డ్రగ్స్ వల్ల చనిపోలేదని.. ఆయనను హత్య చేశారని మొదటి నుంచి చెబుతున్న ఆయన కూతురు ప్కారీస్ ఓ పోరాటం ప్రారంభించనున్నది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







