త్వరలో అసెంబ్లీకి హీరోమహేష్ బాబు
- June 06, 2017
సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడు. అవును.. తన నెక్ట్స్ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో వేసిన భారీ అసెంబ్లీ సెట్లో అడుగుపెట్టబోతున్నాడు మహేష్. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్, ఆ తరువాత వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మహేష్ లేకుండానే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
త్వరలో ప్రారంభం కానున్న సెకండ్ షెడ్యూల్లో మహేష్ కూడా పాల్గొననున్నాడట. పొలికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు యువ రాజకీయనాయుడిగా కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కూడా అలరించనున్నాడట. ఈ సినిమాకు భరత్ అను నేను అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో ఏదీ నిజం ఏదీ రూమర్ అన్న విషయం తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







