మిడిల్ ఫింగర్ చూపినందుకు మహిళకు జైలు
- June 07, 2017
రహదారిపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే కాకుండా మిడిల్ ఫింగర్ చూపించి అసభ్యకరంగా వ్యవహరించిన కేసులో రష్యాకి చెందిన మహిళకు మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. పబ్లిక్ ప్రాసిక్యూషన్ రికార్డుల ప్రకారం 2016 మే 24న పామ్ జుమైరాలో, నిందితురాలు నిర్లక్ష్యంగా వాహనం నడిపి, రోడ్డుని బ్లాక్ చేసి, మరో వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తులపై దూషణకు దిగింది. 41 ఏళ్ళ అమెరికన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తగిన లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపడం, ఇతరుల లైసెన్స్ చూపించి పోలీసులను మోసగించే ప్రయత్నం చేయడం, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం వంటి కేసుల్లో రష్యన్ మహిళను దోషిగా న్యాయస్థానం నిర్ధారించింది. కోర్టు తీర్పుని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం







