కేరళ ఎమ్మెల్యే కూతురు పెళ్ళికి ధరించిన నగలతో ప్రజలు షాక్
- June 07, 2017
దేశంలోనే అత్యంధికంగా బంగారం కొనే రాష్ట్రం కేరళ అని వాసికెక్కిన సంగతి విధితమే.. ఇటీవల సెలబ్రేటీల ఇంట్లో పెళ్లిళ్లు.. సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.. తాజాగా కేరళలో ఓ వామపక్ష నేత ఇంట్లో జరిగిన కూతురు పెళ్లి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.. ఆమె ధరించిన నగలు హాట్ హాట్ టాపిక్ గా మరారింది.. వివరాల్లోకి వెళ్తే...
కేరళ కు చెందిన సీపీఐ ఎమ్మెల్యే గీతా గోపి కుమార్తె పెళ్లి గత ఆదివారం త్రిశూర్ లో జరిగింది.. ఈ పెళ్ళిలో పెళ్లికూతురు ధరించిన నగల ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది.. దీంతో వామ్మో ఇన్ని బంగారు నగలా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాదు.. ఓ ఎమ్మెల్యే కూతురు వంటి పై ఇన్ని నగలు ఎలా వచ్చాయి అని ప్రశ్నిస్తున్నారు.. కాగా తన కూతురు పెళ్ళికి ధరించిన నగల విషయంపై సదరు ఎమ్మెల్యే స్పందిస్తూ.. దక్షిణ భారత దేశంలో నగలకు, సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు.. అందుకే తన కూతురి పెళ్ళికి సంప్రదాయం పాటిస్తూ.. నగలను చేయించాను అని సమర్ధించుకొన్నాడు.. కాగా సీపీఐ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్న ఈ గీతా గోపి.. తన పార్టీ సిద్దాంతలను పక్కన పెట్టి.. కూతురు విషయంలో పెళ్లి సిద్ధాంతాన్ని పాటించాడు.. అని అంటున్నారు.. దేశంలో రాజకీయ నాయకుల ఇంట్లో ఉండే బంగారం బయటకు తీస్తే.. భారత దేశంలో పేదరికమే ఉండదు అని మరికొంత మంది నెటిజన్లు కామెంట్స్ కూడా పెడుతున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







