ప్రభాస్ కొత్త లుక్...
- June 07, 2017
తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో ప్రభాస్. ఈశ్వర్ చిత్రంలో మాస్ హీరోగా కనిపించిన ప్రభాస్ తర్వాత చత్రపతి, మిర్చి చిత్రాలతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో మనోడు ఏకంగా జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ప్రభాస్ ఇప్పటి వరకు తన కెరీర్ లో మీసం లేకుండా ఎప్పుడూ కనిపించలేదు. తొలిసారి ప్రభాస్ మీసాలు కూడా లేకుండా క్లీన్ షేవ్‌తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
బాహుబలి సినిమా కోసం 4 ఏళ్ళ సమయాన్ని కేటాయించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించేందుకు ఇటీవల యూఎస్ వెళ్లి అక్కడ నిపుణుల సమక్షంలో చాలా బరువు కూడా తగ్గినట్టు తెలుస్తుంది. హెయిర్ స్టైల్ విషయంలోను ఈ హీరో కొత్త దనం ట్రై చేస్తున్నట్టు సమాచారం. ఈ మధ్య హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ తో కలిసి ప్రభాస్ కనిపించగా.. అందులో యంగ్ రెబల్ స్టార్ కొత్త హెయిర్ స్టైల్ తో అదరగొట్టేసాడు.
ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ ఫోటో ఒకటి ఫ్యాన్స్ షాక్ ఇచ్చింది. క్లీన్ షేవ్ తో సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు ప్రభాస్. సడెన్ గా ఆ పిక్ చూస్తే ఇది ప్రభాసేనా అని అనుమానం రాకపోదు. మరి టీజర్ లో ఒక లుక్ తో కనిపించిన ప్రభాస్ , రీసెంట్ గా విడుదలైన ఓ పిక్ లో మరోలా ఉన్నాడు. ఇక ఇప్పుడైతే క్లీన్ షేవ్ తో డిఫరెంట్ గా ఉన్నాడు. మరి వీటిలో ప్రభాస్ అస్సలు లుక్ ఏదై ఉంటుందా అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. మరికొంత మంది మొన్నటి వరకు బాహుబలిగా మీసాలు, గడ్డంతో గంభీరంగా కనిపించిన ప్రభాస్ ఇలా బోడిగా కనిపించడం ఏంటీ అని విమర్శస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







