హైదరాబాద్ నగరంలో భారీ వర్షం
- June 07, 2017
నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం వేకువజాము నుంచి భారీగా వర్షం కురుస్తోంది. ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, సరూర్‌నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, వనస్థలిపురం, ఖైరతాబాద్, పంజాగుట్ట, సికింద్రాబాద్, మాదాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, అబ్దుల్లాపూర్‌మెట్, కోఠి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, పాతబస్తీ, మలక్‌పేట, అబిడ్స్, మూసారంబాగ్, జూబ్లీహిల్స్ లోని పలు ఏరియాలలో భారీ వర్షం కురిసింది.
ఉప్పల్, అంబర్ పేట 6 నెం.రోడ్, తాజ్ ఐస్‌లాండ్, బేగంబజార్ పోలీస్ స్టేషన్,బల్కంపేట టెంపుల్, ఫుత్లీబౌలి,సీబీఎస్, అమీర్ పేట్ ఇమేజ్ ఆస్పత్రి, కేసీపీ జంక్షన్, డీకే రోడ్, నిమ్స్,తార్నాక, బేగంపేట్ న్యూ వే, గోల్నాక, ఓల్డ్ గాంధీ ఆస్పత్రి, నింబోలి అడ్డాతో పాటు మలక్‌పేట రైల్వే బ్రిడ్డి వద్ద వర్షపు నీరు భారీగా నిలిచింది. పలు ప్రాంతాల్లో కార్యాలయాల్లోకి వరద నీరు చేరుతోంది. నాలాలు పొంగి పొర్లుతుండటంతో ట్రాఫిక్ కష్టాలు రెట్టింపయ్యాయి.
తెల్లవారుజాము మూడు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో పలుప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయి దారులు జలమయమయ్యాయి. దీంతో పలు జంక్షన్ల వద్ద ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరుతోంది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మరోవైపు నేడు హైదరాబాద్‌లో పంపిణీ కానున్న చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







