న్యూజెర్సీకి చేరిన సాయి పాదుక యాత్ర
- June 07, 2017
అమెరికాలో షిరిడి ఆలయం నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం... తన లక్ష్య సాధనలో కీలకమైన ఓ ఘట్టాన్ని పూర్తి చేసింది. షిరిడి నిర్మాణ స్థలం కొనుగోలు కోసం విరాళాలను సేకరించడానికి 'సాయి దత్తపీఠం స్థల సేవ' పేరుతో అమెరికాలోని న్యూజెర్సీ నుంచి ప్రారంభమైన సాయి పాదుక యాత్ర... 43 రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో కొనసాగి చివరకు మళ్లీ మంగళవారం న్యూజెర్సీకి చేరింది. ఈ సందర్భంగా చేపట్టిన ముగింపు యాత్రకు ప్రవాసాంధ్ర భక్తులు నీరాజనాలు పట్టారు. 5మైళ్లు సాగిన ఈ ముగింపు యాత్రలో వందకుపైగా కార్లతో భక్తులు హాజరయ్యారు. ముందు న్యూజెర్సీలోని మేడిచర్ల మురళికృష్ణ నివాసంలో సాయిపాదుక పూజ నిర్వహించారు. తరువాత పల్లకీ దాత కనికిచర్ల లీలాకృష్ణ నివాసంలో ఆఖరి పాదుక పూజ నిర్వహించి యాత్ర ప్రారంభించారు. స్థానిక పోలీస్ యంత్రాంగం దీనికి సహకరించింది. సాయి దత్తపీఠం సభ్యులు, భక్తులు వందల మంది యాత్రలో పాల్గొన్నారు.
దత్తపీఠం ప్రధాన నిర్వాహకుడు ధర్మశ్రీ రఘుశర్మ శంకరమంచి నేతృత్వంలో రెండేళ్ల నుంచి అమెరికాలోని 43 రాష్ట్రాల్లో 75 వేల మైళ్ల దూరం పాదుక యాత్ర సాగింది. దత్తపీఠం సిద్ధంచేసిన సాయిరథం ద్వారా ఈ పాదుక యాత్ర 43 రాష్ట్రాల్లో దాదాపు 2వేల ఇళ్లకు చేరుకొని సాయిపాదుక పూజ చేసింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







