మాజీ ప్రధానిగా బాలీవుడ్ నటుడు అనుపమ్
- June 07, 2017
భా రత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’. ఇందులో మన్మోహన్ సింగ్‌గా ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. చిత్ర దర్శకుడు విజయ్ రత్నాకర్ గుట్టే మాట్లాడుతూ ‘‘కథను పూర్తి నిజాయతీగా తెరకెక్కించాను. ఈ కథలోని పాత్రకు ఎంతో పరిపక్వత ఉన్న నటుడు కావాలి. అలాంట నటుడు అనుపమ్‌ఖేర్ రూపంలో దొరికార’’న్నారు. ‘‘ఓ ప్రముఖ వ్యక్తి జీవిత కథలో నటిస్తుంటే పోలికలు సహజం. ఛాలెంజింగ్‌గా తీసుకోవాలి. ఇలాంటి సవాళ్లు నా తొలి చిత్రం నుంచే నాకు అలవాటు. మన్మోహన్‌సింగ్‌గా వెండితెరపై నన్ను నేను చూసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’అని చెప్పారు అనుపమ్‌ఖేర్. మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు సంజయ్‌బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







