అతిలోక సుందరి శ్రీదేవి మామ్ ను చూసి షేక్ అవుతున్న మెగా అభిమానులు
- June 07, 2017
అతిలోక సుందరి శ్రీదేవి తన వయసు 50 ప్లస్ దాటిపోయినా ఇంకా లీడ్ రూల్స్ చేస్తూ ఎంతోమంది యంగ్ బ్యూటీలు వచ్చినా తన ప్రత్యేకతను కొనసాగిస్తూనే ఉంది. ఈ పరిస్థుతుల నేపధ్యంలో శ్రీదేవి లీడ్ రూల్ లో నటించిన 'మామ్' జూలై 7న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈసినిమా పై మంచి అంచనాలు ఉండటంతో ఈసినిమాను ప్రమోట్ చేస్తూ శ్రీదేవి ప్రధాన నగరాలలో మీడియా ముందు హడావిడి చేస్తోంది.
ఇలాంటి పరిస్థుతులలో ఈసినిమా కోసం శ్రీదేవి ఎంచుకున్న ఎత్తుగడ మెగా స్టార్ చిరంజీవి అభిమానులకు షాక్ ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈమూవీకి ఏకంగా మెగాస్టార్ 150వ చిత్రం ఖైదీ నంబర్ 150తో పోలిక పెట్టుకుంటోందట శ్రీదేవి. ఒక హీరోయిన్ 300 సినిమాలలో నటించడం ఎవరూ ఊహించని రికార్డు.
శ్రీదేవి నటించిన 'మామ్' సంఖ్యలో 300వ సినిమాగా మారుతున్న నేపధ్యంలో మెగా స్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' కి అనుసరించిన పబ్లిసిటీ వ్యూహమే శ్రీదేవి కూడ తన సినిమాకు అనుసరించమని తన పిఆర్ టీమ్ కు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. చిరంజీవి నటించిన 'ఖైదీ' 150వ సినిమా కావడంతో ఆసినిమాకు క్రేజ్ ఏర్పడినట్లుగా తన 'మామ్' కూడ 300వ సినిమా అవ్వడంతో దేశవ్యాప్తంగా 'ఖైదీ' తరహాలో ఒక పబ్లిసిటీ మ్యానియాను క్రియేట్ చేయాలని శ్రీదేవి ఆలోచిస్తున్నట్లు టాక్.
అయితే ఇప్పుడు ఈ వార్తలు బయటకు రావడంతో ఈ వార్తల ఫై మెగా అభిమానులు తీవ్ర అసహనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 'మామ్' సినిమా ప్రమోట్ చేసుకోవడం శ్రీదేవి హక్కు అయినా కోట్లాదిమంది అభిమానులు ఉన్న చిరంజీవితో శ్రీదేవికి పోలిక ఏమిటి అంటూ మెగా అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. ఈసినిమాలో సవితి తల్లి పాత్రను పోషిస్తున్న శ్రీదేవి తన సవితి కూతురుకు అన్యాయం చేసిన వారి పై పగ ఎలా తీర్చుకుంది అన్న కథతో నిర్మించ బడ్డ ఈసినిమా పై చాల భారీ అంచనాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







