నటి విజయశాంతి చూపు అన్నాడీఎంకే వైపు
- June 07, 2017
లేడీ అమితాబ్ విజయశాంతి అన్నాడీఎంకేలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు నిజం చేయబోతున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. దీనికి బలం చేకూర్చేవిధంగా విజయశాంతి జైలులో వున్న శశికళతో సమావేశమై చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆపై చెన్నైలోని అన్నాడీఎంకే డిప్యూటీ నేత టీటీవీ దినకరన్‌తో కూడా సమావేశమయ్యారు. అదే సమయంలో తనను కలవడానికి వచ్చిన ఎమ్మెల్యేలను సైతం పక్కన పెట్టి విజయశాంతితో మంతనాలు జరిపారు దినకరన్. పార్టీ వ్యవహారాలను దినకరన్ చక్కదిద్దగలరనే నమ్మకముందని విజయశాంతి ఎమ్మెల్యతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా దినకరన్‌కు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఈ సంఖ్య 22 నుంచి 32కు పెరిగింది. ఈ సంఖ్య 50 కి చేరుకోనుందని, ఒకటీ రెండు రోజుల్లోనే తమ బలం నిరూపించుకునే అవకాశం వస్తుందని దినకరన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!







