ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన యువతకు జాబ్ మేళా
- June 07, 2017
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి పరిధిలోని గ్రామాల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఆర్‌డీఏ సంస్ధ భారీ ఎత్తున ఉద్యోగమేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. ఈ నెల 8న మంగళగిరి మండలం నవులూరులో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసేందుకు యువకులను ఎంపిక చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. సాంకేతిక అర్హతలతో పాటు, ఇతర అర్హతలున్న వారిని ఎంపిక చేయనున్నారు. ఈ మేళాలో 17 ప్రముఖ సంస్థలు పాల్గొంటాయి. రాజధాని ప్రాంతంలోని 24 గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువత అర్హులు. భూములిచ్చిన రైతుల పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. ఈ మేళా ద్వారా వివిధ ఉద్యోగాలకు 885 మందిని ఎంపిక చేయనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







