ఐటమ్‌గర్ల్‌గా డిస్కోశాంతి చెల్లెలు సుచిత్ర
- June 08, 2017
'తంగరథం'తో తమిళ సినిమాలో ఎంట్రీ
16న తెరపైకి
1980, 90ల్లో దక్షిణాదిని ఓ ఊపు ఊపిన శృంగారతారల్లో డిస్కో శాంతి ఒకరు. తెరపై ఆమె కనిపిస్తే చాలు థియేటర్లు మారుమ్రోగిపోయేవి. అయితే డిస్కోశాంతి కొన్నేళ్లుగా సినిమాలు తగ్గించేసి కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాల్లో ఆమె లేని లోటును భర్తీ చేసేందుకు ఆమె చెల్లెలు సుచిత్ర త్వరలోనే తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వచ్చే 16న విడుదల కాబోతున్న 'తంగరథం' చిత్రంలో సుచిత్ర ఐటమ్‌గర్ల్‌గా నటించింది. మొట్టైరాజేంద్రన్తో కలిసి ఆమె చేసిన ఐటమ్‌సాంగ్ ఈ సినిమాలోని హైలెట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు చిత్ర దర్శకుడు బాలమురుగన్. ఎన్టీసీ మీడియా, వీకేర్ ప్రొడక్షన్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న 'తంగరథం'లో వర్ధమానతారలు వెట్రి, అతిదికృష్ణన్ హీరోహీరోయిన్లుగా నటించారు. మదురై, కోవైల మధ్య ఉన్న ఓట్టాన్‌సత్రం మార్కెట్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన గ్రామీణ ప్రేమకథాచిత్రంగా తంగరథం' తెరకెక్కింది. ఓట్టాన్‌సత్రం మార్కెట్లో లైవ్‌గా చిత్రీకరణ జరిపారు. ఆ మార్కెట్‌పై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల్లో దర్శకుడు బాలమురుగన్ కుటుంబమూ ఒకటి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







