షారుక్ ఖాన్, అనుష్క శర్మ సినిమాకు వెరైటీ టైటిల్
- June 08, 2017
షారుక్ ఖాన్, అనుష్క శర్మ ముచ్చటగా మూడోసారి జంటగా కన్పించబోతున్నారు. ఈ సినిమాకి ‘రెహనుమా’, ‘ది రింగ్’ అనే టైటిల్స్ అనుకున్నారు. కానీ వెరైటీగా ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో షారుక్ హ్యారీ పాత్రలో, అనుష్క సెజల్ పాత్రల్లో నటిస్తున్నారు. షారుక్, అనుష్క కాంబినేషన్ కంటే ఈ సినిమాకు ఏం టైటిల్ పెట్టబోతున్నారన్న దానిపైనే ఇన్నాళ్లూ బాలీవుడ్‌లో చర్చ జరిగింది.
1989లో వచ్చిన ‘వెన్ హ్యారీ మెట్ సాలీ’ అనే హాలీవుడ్ సినిమాలాగే ఈ సినిమానీ తెరకెక్కిస్తున్నారు. అదీకాకుండా ఇంతియాజ్ అలీ తీసే సినిమా టైటిల్స్‌లో ‘జబ్’ అనే పదం ఎక్కువగా ఉంటుంది. జబ్ అంటే అప్పుడు అని అర్థం. 2007లో షాహిద్ కపూర్, కరీనా కపూర్ నటించిన ‘జబ్ వి మెట్’ చిత్రాన్ని కూడా ఇంతియాజే తెరకెక్కించారు.
ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అందుకే షారుక్ సినిమాకి కూడా జబ్ అనే పదం వచ్చేలా టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి టైటిల్‌తో వచ్చిన సినిమాలో షారుక్ నటించడం కూడా ఇదే తొలిసారే. ఆగస్ట్‌లో ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







