ఆదిత్య మ్యూజిక్ కంపెనీ వారి నిర్మాణంతో కార్తీ సినిమా
- June 08, 2017
కార్తి.. తమిళ సినిమాలను తెలుగు లో డబ్ చేసి రిలీజ్ చెయ్యడంతో తెలుగు వారికి సుపరిచితుడే.. ఇక ఊపిరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు.. వరస విజయాలతో దూసుకొని పోతున్న కార్తి తాజాగా "ధీరమ్ అధిగారం ఒండ్రు" అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాలో రకుల్ ప్రీతి సింగ్ కార్తి కి జోడీగా నటిస్తున్నది.. కాగా కార్తి సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాలో కార్తి పోలీసు ఆఫీసర్ గా నటిస్తున్నాడు.. భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు.. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా తెలుగులో రిలీజ్ చెయ్యడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా.. ఇప్పటి వరకూ ఆడియో రంగంలో ఉన్న ఆదిత్య మ్యూజిక్ కంపెనీ వారు.. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ.. నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







