మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'రంగస్థలం.. 1985' లో అంటోన్న సుకుమార్
- June 08, 2017
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. మాస్ హీరో నుంచి డిఫరెంట్ నేపద్యం కధలను ఎంచుకొనే దిశగా అడుగులు వేశాడు.. ధృవ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు.. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో గ్రామీణ నేపద్య కధ తో తెరకెక్కుతున్న సినిమాలో చరణ్ తొలిసారిగా గ్రామీణ యువకుడిగా నటిస్తున్నాడు.. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ లో రామ్ చరణ్ లుక్ చూసి ఈ సినిమా పై భారీ అంచలను ఏర్పడ్డాయి.. కాగా ఈ సినిమా కు రేపల్లె, నీలకంఠ, పల్లెటూరు మొనగాడు వంటి అనేక టైటిల్స్ వినిపించాయి.. కాగా తాజా గా చిత్ర యూనిట్ "రంగస్థలం... 1985" అనే టైటిల్ ను ప్రకటించింది.. తోనే ఈ సినిమా ఎంత డీ గ్లామర్ గా ఉండనున్నదో తెలుస్తుంది.. ఇప్పటికే గోదావరి జిల్లాలో షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నది. చరణ్ సరసన తొలిసారిగా సమంత హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం.. కాగా సమంత పెళ్ళికి ముందు చరణ్ తో జోడీ కట్టగా.. అప్పట్లో.. నాగార్జునతో పెళ్ళికి ముందు అమల .. మెగా స్టార్ చిరంజీవి తో రాజావిక్రమార్క కావడం యాదృశ్చికమే.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న "రంగస్థలం" కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







