డీజే సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోని అల్లు అర్జున్
- June 08, 2017
సరైనోడు హిట్ తర్వాత బన్నీ తాజా సినిమా 'డీజే'. ఇప్పటికే ట్రైలర్ తో యూట్యూబ్ లో రికార్డ్స్ ను క్రియేట్ చేస్తోండగా.. ఆడియో వేడుక, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు సిద్దం అవుతున్నది.. కాగా డీజే సినిమా రంజాన్ కానుకగా ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు రానున్నది.. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగినట్లు తెలుస్తోంది.. కాగా ఈ సినిమా కోసం బన్నీ.. రెమ్యునరేషన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ హాట్ టాపిక్.. ఈ సినిమాకు అల్లు అర్జున్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొన్నట్లు కొందమంది అనుకొంటున్నా.. నిజానికి బన్నీ ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట.. రెమ్యునరేషన్ బదులు.. థియేత్రికల్ రైట్స్ ను పారితోషకం బదులు తీసుకొన్నట్లు టాక్ వినిపిస్తోంది.. కృష్ణ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని థియేత్రికల్ రైట్స్ ను బన్నీ తీసుకొన్నట్లు తెలుస్తోంది.. డీజే సినిమా హిట్ టాక్ వచ్చినా మొత్తం.. రూ.15 కోట్లు ఉంటుందని.. అదే డీజీ బ్లాక్ బస్టర్ హిట్ కనుక ఐతే.. అపుడు కలెక్షన్లు పెరిగి బన్నీ రెమ్యునరేషన్ రూ.20 కోట్లు దాటవచ్చని ట్రేడ్ వర్గ అంచనా... గంగోత్రి సినిమా తో పరిశ్రమలో అడుగు పెట్టిన బన్నీ సినిమా సినిమా కు తన క్రేజ్ ను పెంచుకొంటూ.. స్టార్ హీరోగా మారాడు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







