పాస్‌పోర్ట్ సీజ్: చిక్కుల్లో మహిళ
- June 09, 2017
స్పాన్సర్ తన పాస్‌పోర్ట్‌ని తీసుకోవడంతో తన భవిష్యత్ అంధకారంగా మారిందంటూ ఓ మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే ఈ కేసు విచారణ నవంబర్‌కి వాయిదా పడింది. ఒకవేళ తీర్పు త్వరగా కావాలనుకుంటే ఆమె అత్యవసర న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునని ఎల్‌ఎంఆర్‌ఎ వర్గాలు వెల్లడించాయి. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన యజమాని తన వీసాని రద్దు చేశారని బాధితురాలు ఆరోపించారు. ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్‌షోర్ రిక్లమేషన్ కాంట్రాక్ట్స్ సంస్థలో స్టాఫ్ క్లీనర్‌గానూ, కేటరర్ అసిస్టెంట్‌గానూ ఆమె పనిచేస్తున్నారు. ఫిలిప్పీన్స్‌కి చెందిన జెన్నీ తనకు ఎదురైన సమస్య గురించి చెబుతూ, అత్యవసర న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి తన వద్ద తగిన ఆర్థిక వనరులు లేవని చెప్పారు. ఈ కారణంగా నవంబర్ వరకు తీర్పు కోసం ఎదురుచూస్తానన్నారు. ఫిలిప్పీన్ ఎంబసీ అధికారులు, బాధితురాలికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పాస్‌పోర్ట్ తనవద్దనే ఉంచుకున్న యజమాని సయెద్ సలెహ్ మొహ్‌సెన్ ఈ వివాదంపై స్పందించడానికి నిరాకరించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







