జీతాల ఆలస్యంపై జిఎఫ్బిటియు ఖండన
- June 09, 2017
ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ, తమ వద్ద పనిచేస్తున్న కార్మికులకు సకాలంలో జీతాలు ఇవ్వకపోవడాన్ని జనరల్ ఫెడరేషన్ ఆఫ్ బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్స్ ఖండించింది. కార్మికులు చాలా కాలంగా సరైన వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నారని జిఎఫ్బిటియు జనరల్ సెక్రెటరీ హసన్ అల్హాల్వాచి చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సూచనల్ని సైతం ఆ సంస్థ పట్టించుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారాయన. రమదాన్ సందర్భంగా కార్మికుల సమస్యల్లో ఉండకూడదని, సంస్థ వెంటనే కల్పించుకుని సమస్యను పరిష్కరించాలని హసన్ చెప్పారు. మండు వేసవిలోనూ కార్మికులు తమ సమస్యలపై ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదని హసన్ అన్నారు. కింగ్‌డమ్‌లోని పలు కార్మిక సంఘాల్లో జిఎఫ్బిటియు ప్రధానమైనది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







