గ్రాండ్ వేలో దువ్వాడ జగన్నాధం ఆడియో రిలీజ్
- June 10, 2017
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, ఎనర్జిటిక్ డైరక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న సినిమా డీజే (దువ్వాడ జగన్నాథమ్). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో రూపొందుతోన్న 25వ సినిమా ఇది. రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు ధీటుగా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన రెండు రోజుల్లోనే 10 మిలియన్స్ వ్యూస్‌తో ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంటుందీసినిమా.
ఆర్య, ఆర్య2, సన్నాఫ్ సత్యమూర్తి ఇలా బన్నీ.. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. గబ్బర్‌సింగ్ తర్వాత హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ కలయికలో రూపొందిన చిత్రం కూడా ఇదే. ఇలాంటి హిట్ కాంబినేషన్ కలయికలో డీజే దువ్వాడ జగన్నాథమ్ ఆడియో ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్రెడి సోషల్ మీడియాలో విడుదలైన రెండు పాటలకు హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పాటల విడుదల వేడుకను జూన్ 11న గ్రాండ్ లెవల్లో నిర్వహిస్తున్నారు.
జూన్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







