ఫోన్ లో టైప్ చేస్తూ.. గోతిలో పడిపోయింది...
- June 10, 2017
న్యూజెర్సీ : సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడిపేవాళ్లు ఎందరో. అలాగే సెల్ ఫోన్ లో చూసుకుంటూ రోడ్లపై పరధ్యానంగా నడుస్తూ ప్రమాదాలకు గురవుతున్నవాళ్లు కూడా కోకొల్లలు. ఇది సరిగ్గా అలాంటి సంఘటనే.
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఓ మహిళ(67) తన సెల్‌ఫోన్ చూసుకుంటూ పరధ్యానంగా ఫుట్‌పాత్‌పై నడుస్తూ ప్రమాదానికి గురైంది. ఆమె సెల్ఫోన్లో సంక్షిప్త సందేశాలను టైప్ చేస్తూ
ఫుట్‌పాత్‌పై నడుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆ దారిలో తెరిచి ఉన్న ఓ బేస్మెంట్ డోర్లను ఆమె గమనించలేకపోయింది. దీంతో ఒక్కసారిగా అదుపుతప్పి అందులో పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళుతున్న ఇద్దరు మహిళలు ఈ ఘటన చూసి నిశ్చేష్టులయ్యారు.
6 అడుగుల లోతులో ఉన్న గోతిలో ఆమె పడడంతో విషయం తెలిసి పలువురు అక్కడికి చేరుకుని బాధితురాలిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఆ మహిళకు తీవ్ర గాయాలవడంతో ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు.
గ్యాస్ పైప్లైన్లకు మరమ్మతు పనులు చేపట్టేందుకు ఆ బేస్మెంట్ డోర్లను తెరిచినట్లు అధికారులు తెలిపారు. అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైన ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మీరూ చూడండి!
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







