ఇరాన్ తరువాత మా టార్గెట్ సౌదీ అరేబియా అంటున్న ఐసిస్
- June 10, 2017
రియాద్: ఇరాన్ పార్లమెంట్ పై దాడి చేసింది మేమే అంటూ ప్రకటించుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు (ఐఎస్ఐఎస్) ఇప్పుడు మరో దేశం మీద దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు మా టార్గెట్ సౌదీ అరేబియా అంటూ ఓ వీడియో విడుదల చేశారని అధికారులు గుర్తించారు.
ఇరాన్ దాడికి ముందే ఆ వీడియో రికార్డు చేశారని సైట్ (ఎస్ఐటీఇ) అధికారులు అంటున్నారు. ఇరాన్, సౌదీ అరేబియాలో తాము దాడులు చేస్తామని ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఓ ఉగ్రవాది హెచ్చరించాడు. మేమే సౌదీ అరేబియాలో అడుగు పెట్టం అన్నాడు.
అయితే మీదేశంలోనే ఉన్న మా సహచరులు దాడులు చెయ్యడానికి సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశాడు. ఇరాన్ తరువాత మా టార్గెట్ సౌదీ అరేబియానే, మమల్ని ఎవ్వరూ అడ్డుకోలేరని ఆ ఉగ్రవాది చాలెంజ్ చేశాడు. అంతే కాకుండా ఇరాన్ లో షియా వర్గీయులపై మరన్ని దాడులు చేస్తామని హెచ్చరించాడు.
మేము ఎవ్వరి ఏజెంట్లు కాదు, దేవుడు చెప్పినట్లు నడుచుకుంటాం. మేము ఇస్లాం ధర్మం కోసం పోరాటం చేస్తున్నాం, గల్ఫ్ దేశాలను సైతం వదిలిపెట్టం అంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది హెచ్చరించాడు. ఇప్పుడు మా టార్గెట్ సౌదీ అరేబియా అంటూ స్పష్టంగా హెచ్చరికలు చెయ్యడంతో ఆ దేశంలో భద్రత కట్టుదిట్టం చేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







