సల్మాన్ ఖాన్ మరియు ప్రభుదేవా చిత్రం వచ్చేస్తోంది
- June 11, 2017
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’, ‘దబాంగ్ 2’ చిత్రాలతో మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ‘దబాంగ్ 3’కు ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నారని చిత్రవర్గాల సమాచారం. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో సల్లూభాయ్ ఇన్స్పెక్టర్ చుల్బుల్ పాండే పాత్రలో కనిపించనున్నారు. ‘టైగర్ జిందా హై’ చిత్రం షూటింగ్ పూర్తైన తర్వాత దీని చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అమీ జాక్సన్ ‘దబాంగ్ 3’లో కథానాయికగా నటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ‘దబాంగ్’ తొలి రెండు భాగాల్లోనూ సోనాక్షి సిన్హా కథానాయికగా నటించారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో సల్మాన్ నటించిన ‘ట్యూబ్‌లైట్’ జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







