విమాన ఇంజిన్‌కు భారీ రంధ్రం, అత్యవసర లాండింగ్
- June 12, 2017
చైనా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఎగురుతున్న సమయంలో ఇంజిన్‌కు భారీ రంధ్రం ఏర్పడింది. దాంతో కాలిపోతున్నట్లుగా వస్తున్న వాసనను పసిగట్టిన ప్రయాణికులు పైలట్‌కు సమాచారమందించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ విమానాశ్రయంలో దించాడు. దాంతో అంతా వూపిరి పీల్చుకున్నారు. ‘చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్’కు చెందిన ఎయిర్‌బస్ ఏ330 విమానంలో ఈ ఘటన చేటుచేసుకుంది.
విమానం సిడ్నీ నుంచి చైనాలోని షాంఘైకి బయలుదేరిన గంట తర్వాత పెద్దగా శబ్ధం వచ్చింది. అనంతరం కాలిపోతున్న వాసన రావడాన్ని ప్రయాణికులు గుర్తించారు. దాంతో గాల్లో ఎగురుతున్న విమానం ఎక్కడ కూలిపోతుందోనన్న భయంతో అంతా వణికిపోయారు. విమానాన్ని వెనక్కి మళ్లించిన పైలట్.. సిడ్నీలో సురక్షితంగా దించారు. విమానం ఇంజిన్‌కు భారీ రంధ్రం ఏర్పడిందని ఇంకాసేపు విమానం గాల్లోనే ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







