సిగరెట్లు, ఎనర్జీ డ్రింక్స్‌పై పన్ను రెండింతలు
- June 12, 2017
జెడ్డా: సిగరెట్లు, ఎనర్జీ డ్రింక్స్‌పై పన్ను రెట్టింపు చేస్తూ తీసుకున్న నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కొత్త ఎక్సయిజ్ ట్యాక్స్‌ని ఇంపోజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 'సిన్ టాక్స్' పేరుతో ఈ ట్యాక్స్‌ని వ్యవహరిస్తున్నారు. అనారోగ్యానికి కారణమయ్యే వాటిపై ఈ ట్యాక్స్‌ని అమలు చేస్తారు. ట్యాక్స్ పెంపుతో మార్కెట్‌లో చాలావరకు సిగరెట్ అమ్మకాలు తగ్గిపోయాయి. ఆయా సిగరెట్ల దిగుమతి కూడా తగ్గిపోయింది. తాను రెగ్యులర్‌గా స్మోక్ చేసే ఓ సిగరెట్ బ్రాండ్ మార్కెట్‌లో లభ్యం కావడంలేదని ఓ వ్యక్తి పేర్కొన్నారు. జెడ్డాలోని ఓ ప్రముఖ సూపర్ మార్కెట్‌లో రెగ్యులర్‌గా లభించే సాఫ్ట్ డ్రింక్ ఇప్పుడు కన్పించడంలేదని మరో వ్యక్తి చెప్పారు. ప్రస్తుతం ఆ సాఫ్ట్ డ్రింక్ ఖరీదు 2.25 సౌదీ రియాల్స్‌కి చేరుకుంది. అన్ హెల్తీ సాఫ్ట్ డ్రింక్స్‌పై, ఆ వివరాల్ని స్పష్టంగా పేర్కొంటుండడంతో, వాటి అమ్మకాలూ గణనీయంగా పడిపోయినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ధరల పెంపుతో సిగరెట్ స్మోకింగ్, సాఫ్ట్ డ్రింక్స్ సేవించడం తగ్గించేసినట్లు కొందరు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







