ఫోన్ కాల్‌తో ట్రాఫిక్ జరీమానాల చెల్లింపు
- June 12, 2017
దుబాయ్: ట్రాఫిక్ జరీమానాల చెల్లింపును ఇకపై ఫోన్ ద్వారా చేయవచ్చునని రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) వర్గాలు వెల్లడించాయి. ఆర్టిఎ కాల్ సెంటర్‌కి ఫోన్ చేసి, సంబంధిత ప్రాసెస్ ద్వారా ట్రాఫిక్ జరీమానాలు చెల్లించవచ్చు. ఆర్టిఎ ఎకాల్ సెంటర్ (8009090) - పేమెంట్ గేట్ వే ద్వారా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి జరీమానాలు చెల్లించడానికి వీలు కల్పించారు. ఐవీఆర్ సిస్టమ్ ద్వారా ట్రాఫిక్ జరీమానాలు చెల్లించడంతోపాటుగా, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, రీప్లేస్మెంట్ ఆఫ్ కార్డ్, డ్యామేజ్డ్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్, రీప్లేస్మెంట్ లేదా పోగొట్టుకున్న, డ్యామేజీ అయిన వెహికిల్ రిజిస్రేట్షన్, దుబాయ్ బ్రాండ్ వెహికిల్ ప్లేట్ వంటి సౌకర్యాలను కూడా పొందే వీలుంది. ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ - ఐవీఆర్ సిస్టమ్ పేమెంట్ ప్రయోగాత్మక దశలో ఉంది. ఈ ప్రయోగం సక్సెస్ అయ్యాక పూర్తిస్థాయిలో ఈ విధానం ద్వారా కార్యకలాపాల్ని ముమ్మరం చేస్తారు.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







