అక్షయ్ నటించిన 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ' ట్రైలర్ టాక్
- June 12, 2017
బాలీవుడ్ స్టార్ హీరోల అందు స్టార్ హీరో అక్షయ్ కుమార్ వేరయా అని అనాలెమో..! తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా భూమి పెద్నెకర్ హీరోయిన్ గా శ్రీనారాయణ సింగ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా "టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ". ఈ సినిమా ట్రైలర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.. కాగా ఈ ట్రైలర్ ని చూస్తే.. మంచి విషయం ఉన్నట్లు కనిపించినా.. గవర్నమెంట్ యాడ్ తరహాలో ఉన్నట్లు అనిపించింది..
రెండు ప్రక్కప్రక్క గ్రామాలకు చెందిన కేశవ్ (అక్షయ్), జయ (భూమి) లు ప్రేమలో పడతారు.. అనంతరం పెళ్లి చేసుకొంటారు.. తీరా ఫస్ట్ నైట్ అనంతరం.. హీరో చెల్లులు వచ్చి.. లోటాల పండగ పబ్లిక్ లో టాయిలెట్ కు ఈ ఊరి అమ్మాయిలతో తొలిసారి వెళ్లే పండగట) కు రమ్మనమని అన్న వదినలను పిలుస్తుంది.. దీంతో హీరోయిన్ భూమి కి కూడా టాయిలెట్ ఆవశ్యకత అర్ధం అయి.. తను కూడా మీ ఇంట్లో టాయిలెట్ కట్టిస్తేనే వస్తాను.. లేదంటే ఇక నేను రాను అని పుట్టింటికి వెళ్లిపోతుంది.. దీంతో తన భార్య టాయిలెట్ కోరిక తీర్చడానికి అక్షయ్ పడ్డ తిప్పలు.. తులసి మొక్కలు నాటుకొని పూజ చేసే ప్లేస్ లో టాయిలెట్ కత్తికోవడం తప్పు అనే ఆలోచనలున్న గ్రామస్తులను ఎలా మార్చి టాయిలెట్ కట్టించుకొనేలా చేశాడు అనేది.. ఈ ట్రైలర్ లో కనిపిస్తుంది.. కాగా ఈ ట్రైలర్ చూస్తే.. ఒక ప్రభుత్వ రంగా యాడ్ గుర్తు రావడం సహజం... మరి అక్షయ్ ఈ సినిమాలో హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి మరి.. కాగా అక్షయ్ ముంబైలోని మొబైల్ టాయిలెట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి విధితమే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







