బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం: కొండచరియలు విరిగిపడి 26మంది మృతి
- June 13, 2017
బంగ్లాదేశ్‌లో పెను ప్రమాదం సంభవించింది. భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 26 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా బంగ్లాదేశ్‌లోని ఢాకా, చిట్టగాంగ్ నగరాల్లో సోమవారం నుంచీ ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు సంభవించి.. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
ఈ ఘటనల్లో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. రంగమతిలో 10 మంది, బందర్బాన్‌లో ఏడుగురు, చిట్టగ్యాంగ్‌లో 8 మంది కొండచరియల కింద సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. భారీ వర్షాలతో అప్రమత్తమైన సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







