విజయం నీ కోసం.............!
- October 12, 2015
శిశిరంలో రాలే ప్రతి ఆకు
ఎదురు చూస్తుంది వసంతం కోసం
నే మళ్ళీ వికసించనా అని...............!
ఎగసిపడే ప్రతి అల
వేచి చూస్తుంది
నే తీరాన్ని తాకలేనా అని................!!
విరబూసే ప్రతి సూర్యముఖి
కాచుకు చూస్తుంది
ఉదయం ఎపుడవుతుందా అని........!
కూసే ప్రతి కోయిల
చూస్తుంది
తను కూసే కాలం ఎపుడస్తుందా అని...................!!
గగనంలో మెరిసే ప్రతి తార
చూస్తుంది
తన కోసం తిమిరం ఎపుడవుతుందా అని.............!
భవిష్యత్ లో వచ్చే ప్రతి విజయం
వేచి చూస్తుంది
తన కోసం నువ్వింకా
రావేంటని...........................!!
(కాబట్టి పరుగెత్తు , విజయం నీకై ఎదురుచూస్తుంది)
ఆ తిమిరపు , కాలంలో ,
ఉదయించే , తీరాన ,
వికసించేది , నువ్వే.........!!!
~రాకేష్ మాలేపు
తాజా వార్తలు
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్







