వ్యభిచార ముఠా గుట్టు రట్టు

- June 17, 2017 , by Maagulf
వ్యభిచార ముఠా గుట్టు రట్టు

మేకప్మెన్ సహా ఇద్దరు జూనియర్ ఆర్టిస్టుల అరెస్టుహైదరాబాద్: ఆన్లైన్ వ్యభిచారానికి పాల్పడుతున్న ముగ్గుర్ని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకొని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్గూడ మధురానగర్లోని ఓ వసతి గృహంలో ఉంటూ టీవీ సీరియళ్లలో నటిస్తున్న యువతి (28), సైనిక్పురి ఆర్కేపురానికి చెందిన మరో యువతి(28), యూసుఫ్గూడకు చెందిన మేకప్మెన్ కె.బండారి(23) ముఠాగా ఏర్పడి ఆన్లైన్ వ్యభిచారానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ముగ్గురు కలిసి బోడుప్పల్ ఎన్టీఆర్ విగ్రహం వద్దకు కారులో వచ్చారు. అప్పటికే సమాచారం అందుకున్న మల్కాజిగిరి స్పెషల్ ఆప¾రేషన్ టీం ఇన్స్పెక్టర్ నవీన్కుమార్, ఎస్సై మహేష్, మోతీలాల్ తదితరులు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. వారినుంచి రూ. 17వందల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com