బన్నీ హీరోయిన్లకి ప్రిన్స్ మహేష్ బాబు ఆఫర్
- June 18, 2017
అల్లు అర్జున్‌తో చేసిన హీరోయిన్లకి ప్రిన్స్ మహేష్ మూవీలో ఆఫర్ రావడం కంటిన్యూగా జరుగుతోంది. తమన్నాతో మొదలుపెట్టి రకుల్ ప్రీత్ వరకూ బన్నీతో చేసిన తరువాతే మహేష్ మూవీలో ఆఫర్ వచ్చింది. బన్నీతో 'బద్రీనాథ్' మూవీ చేసిన తరువాత మహేష్ 'ఆగడు' సినిమా చేసింది తమన్నా. 'రేసుగుర్రం' చేసిన తరువాతే శృతి హాసన్‌కు 'శ్రీమంతుడు'లో ఆఫర్ వచ్చింది. అలాగే 'సరైనోడు' తరువాతే రకుల్‌కి 'స్పైడర్' ఆఫర్ వచ్చింది.
ఇవన్నీ చూస్తే బన్నీతో చేసిన తరువాతే మహేష్ మూవీలో ఆఫర్ రావడం అనేది సెంటిమెంట్‌గా మారిందనేది సినీ జనాలమాట. ఇక వంశీ పైడిపల్లితో మహేష్ చేయబోయే మూవీలో పూజా హెగ్డేని హీరోయిన్గా ఫైనల్ చేసారనేది లేటెస్ట్ న్యూస్. అదికూడా బన్నీతో 'డీజే' మూవీ చేసిన తరువాతే మహేష్ మూవీలో పూజాకి ఆఫర్ రావడంతో.. బన్నీతో చేస్తే ప్రిన్స్‌తో పక్కా అని ఫిక్స్ అయిపోయారు సినీ జనాలు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







