టీమిండియా గెలుపు కోసం భారత దేశవ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు
- June 18, 2017
క్రికెట్ లవర్స్ ఊగిపోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మొదలయ్యే మ్యాచ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇంగ్లండ్లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కోసం భారత్, పాకిస్తాన్ తలపడబోతున్నాయి. అందుకే.. ఆ రెండు దేశాల్లోనే కాదు.. క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరూ ఫైనల్ ఫైట్ కోసం వెయిట్ చేస్తున్నారు.
మన దేశంలో టీమిండియా విజయాన్ని ఆకాంక్షిస్తూ.. ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ముస్లింలు.. ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. బోర్డర్లో పాకిస్తాన్ పై తుపాకులు ఎక్కుపెట్టి డ్యూటీ చేసే జవాన్లు... క్రికెట్ గ్రౌండ్ లో జరిగే మహా సంగ్రామంలో కోహ్లీ గ్యాంగ్ వీరవిహారం చేయాలంటూ ఆటపాటలతో కోరుతున్నారు.
లీగ్ దశలో పాక్‌కు చుక్కలు చూపింది.. టీమిండియా. దాన్ని రిపీట్ చేస్తుందని దేశవ్యాప్తంగా అందరిలోను నమ్మకం. పదేళ్ల క్రితం జరిగిన టీ-ట్వంటీ ఫైనల్‌లో పాక్‌ను ఓడించిన భారత్.. ఈసారి కూడా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇటు.. బ్యాట్స్ మెన్, అటు బౌలర్లు, అంతా ఫాంలో ఉండడం కలిసొచ్చే అంశం. భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ పండితులూ చెప్తున్నారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







