2018 చివరికి మార్కెట్లోకి ఎగిరే కార్..
- June 18, 2017
ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే ట్రాఫిక్. బయటకు వెళ్లిన వాళ్లు.. ఇంటికి టైమ్ కు రావాలంటే మధ్యలో ట్రాఫిక్. ఆంబులెన్స్ లో ప్రాణం నిలవడమా? పోవడమా అనేది కూడా ట్రాఫిక్ జామ్ డిసైడ్ చేసే పరిస్థితి. పెరుగుతున్న నగరాలు.. వాహనాలకు తగ్గట్టుగా రోడ్లు వెడల్పు కాకపోవడం.. ఇష్టారాజ్యంగా వాహనాలు నడపడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది. బైక్‌ల సంగతి ఇలా ఉంటే.. ఇక కార్లలో వెళ్లే వారి వెతలు సామాన్యమైనవి కావు. ఒక్కసారి ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారంటే.. ఇక ఎప్పటికి గమ్యం చేరతామో తెలీదు. అయితే, ఇలాంటి వాటికి పరిష్కారంగా ఓ కొత్త కారును డెవలప్ చేస్తోండి డచ్ కంపెనీ. అదే ఫ్లయింగ్ కార్. దాంతో రోడ్డు మీద వెళ్లొచ్చు. ఏకంగా గాల్లో కూడా ఎగరొచ్చు.
మూడు చక్రాలు. హెలికాప్టర్ టైప్ లో రెక్కలు ఉన్న దీనికి రెండు ఇంజిన్లు ఉంటాయి. రోడ్డు మీద గంటకు 170 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. గాల్లోకి ఎగిరితే.. 400 నుంచి 500 కిలోమీటర్ల వరకు ఆగకుండా ప్రయాణం చేయొచ్చు. భూమికి 11వేల 500 అడుగుల ఎత్తులో జర్నీ చేయొచ్చు. డచ్‌కు చెందిన కంపెనీ.. దీనికి పాల్ వీ అనే పేరు పెట్టింది. గేరోకాప్టర్ టైప్ లో దీన్ని తయారు చేసింది. ఒకవేళ గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు రెండు ఇంజిన్లు ఆగిపోయినా.. భయపడాల్సిన పనిలేదు. గాలికి అనుగుణంగా రెక్కలు తిరుగుతూ ఉంటాయి. జీరో స్పీడ్‌లో కూడా వాహనం కిందపడకుండా గాల్లో వేలాడుతూ ఉంటుందని చెబుతున్నారు తయారీదార్లు. కొన్ని సంవత్సరాల నుంచి దీన్ని టెస్ట్ చేస్తున్నారు. 2018 చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయి. మొదటి దశలో 100 వాహనాలను తయారు చేయనుంది కంపెనీ. 2020 నాటికి కొన్ని వందల వాహనాలను మార్కెట్లోకి తీసుకురావడానికి టార్గెట్‌గా పెట్టుకుంది.
ఫ్లయింగ్ కార్స్ అనే కాన్సెప్ట్ మీద చాలా కంపెనీలు పనిచేస్తున్నాయి. అమెరికా, జపాన్, చైనా, చెక్ రిపబ్లిక్, స్లోవేకియాల్లో దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, సుమారు మూడేళ్ల నుంచి టెస్టింగ్‌లో ఉన్న ఈ కారే మొదటిగా మార్కెట్లోకి వస్తుందని కంపెనీ ధీమాగా ఉంది. గాల్లోనూ, నేలమీదా దూసుకుపోయే ఈ ఫ్లయింగ్ కారు.. అంత చీప్ కాదు. మన రూపాయల్లో పోలిస్తే 3 కోట్ల 80 లక్షలకు పైగానే ఉంది. దీని రెండో మోడల్ ధర కోటీ 90 లక్షలు. డబ్బులు పెట్టి కొనేద్దాం అనుకున్న వారికి చివర్లో చిన్న ట్విస్ట్ ఇచ్చింది కంపెనీ. దీన్ని నడపాలంటే కారు డ్రైవింగ్ లైసెన్స్ తోపాటు పైలెట్ లైసెన్స్ కూడా తప్పనిసరి.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







