విజయ్ మరో కొత్త రూపం
- June 18, 2017
తమిళం లో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో ఎవరంటే విజయ్ అనే చెప్పాలి..ఈయన నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు పెద్ద పండగలా జరుపుకుంటారు.. విజయ్ , కీర్తి సురేష్ జంటగా నటించిన భైరవ మూవీ తమిళం లో సూపర్ హిట్ అయినా సంగతి తెల్సిందే..ఈ మూవీ ని తెలుగు లో కూడా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆ టైం లో రిలీజ్ కాలేకపోయింది.
ప్రస్తుతం ఈ మూవీ ని తెలుగు లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'ఏజెంట్ భైరవ' గా ఈ చిత్రానికి తెలుగు లో టైటిల్ ఫిక్స్ చేసారు. జులై రెండో వారం లో ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని తెలుగు రైట్స్ సొంతం చేసుకున్న నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. చాల కాలంగా తెలుగు లో విజయ్ తన మార్కెట్ ను పెంచుకోవాలని చేస్తున్నప్పటికి మన ఆడియన్స్ కు మాత్రం విజయ్ పెద్దగా నచ్చడం లేదు..చాల సినిమాలు తెలుగు లో డబ్ అయ్యాయి..కానీ అవి ఏవి కూడా విజయ్ మార్కెట్ ను పెంచలేక పోయాయి. దీంతో 'ఏజెంట్ భైరవ' తో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవాలని చూస్తున్నాడు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







